మిస్ యూనివర్స్ ఇండియా 2024.. ఎవరీ రియా సింఘా

గుజరాత్‌కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుంది

By Medi Samrat
Published on : 23 Sept 2024 5:30 PM IST

మిస్ యూనివర్స్ ఇండియా 2024.. ఎవరీ రియా సింఘా

గుజరాత్‌కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె ఇప్పుడు 'మిస్ యూనివర్స్ 2024' పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే సెప్టెంబర్ 22న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగిసింది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకున్నందుకు 19 ఏళ్ల రియా సింఘా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది.

మిస్ యూనివర్స్ ఇండియా 2015 సనమ్ రే, హేట్ స్టోరీ 4 చిత్రాలలో నటించిన ఊర్వశి రౌతేలా ఈ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా హాజరయ్యారు. జడ్జింగ్ ప్యానెల్‌లో నిఖిల్ ఆనంద్, ఊర్వశి రౌతేలా, వియత్నామీస్ స్టార్ న్గుయెన్ క్విన్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రియాన్ ఫెర్నాండెజ్, పారిశ్రామికవేత్త రాజీవ్ శ్రీవాస్తవ ఉన్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024 ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉంది గుజరాత్‌కు చెందిన రియా. ఈ ఈవెంట్ నవంబర్ 16, 2024న మెక్సికోలో జరుగుతుంది.

Next Story