బిగ్ షాక్.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను సమర్థించిన హైకోర్టు
మోదీ ఇంటి పేరు విషయంలో చేసిన కామెంట్ల నేపథ్యంలో రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో స్టే పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టేసింది.
By అంజి Published on 7 July 2023 12:09 PM ISTబిగ్ షాక్.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను సమర్థించిన హైకోర్టు
మోదీ ఇంటి పేరు విషయంలో చేసిన కామెంట్ల నేపథ్యంలో రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో స్టే పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఇంతకుముందు సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోదీ ఇంటిపేరును ఉద్దేశించి 2019లో కిందట రాహుల్ గాంధీ ''దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో'' అని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత రాహుల్‌కు వెంటనే బెయిల్ మంజూరైంది. ఈ క్రమంలోనే శిక్ష అమలు నిలుపుదల కోరుతూ రాహుల్ గుజరాత్ హైకోర్టులో రాహుల్ సవాలు పిటిషన్ దాఖలు చేశారు.
అప్పట్లో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించగానే, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద ఆయనను ఎంపీ పదవికి అనర్హులుగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసు జారీ చేసింది. పార్లమెంట్ సభ్యులు ఎవరైనా ఏదైనా కేసులో దోషిగా తేలి, వారికి రెండేళ్ల జైలు శిక్ష పడితే వారు ఎంపీ పదవికి అనర్హులవుతారని లోక్‌సభ సచివాలయం తెలిపింది. ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు ఈ కేసులో వాదనలు విన్న గుజరాత్ హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది.
దొంగలందరి ఇంటి పేర్లలో 'మోదీ' అని ఎలా ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించారంటూ 2019లో ఒక క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలైంది. రాహుల్ గాంధీపై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ ఈ కేసును పెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 499, 500ల కింద రాహుల్‌పై కేసు నమోదైంది. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది.