చిన్న పట్టణాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సినిమా టికెట్లు, థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్‌పై జీఎస్టీ రేట్లను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం, రూ.100 లోపు ధర ఉండే సినిమా టికెట్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. రూ.100 కంటే ఎక్కువ ధర పలికే టికెట్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీ యథాతథంగా కొనసాగుతుంది. మల్టీప్లెక్స్‌లు, ప్రీమియం థియేటర్లపై ఈ మార్పు ప్రభావం దాదాపుగా ఉండదు. ప్యాకేజింగ్‌తో సంబంధం లేకుండా సాల్టెడ్ పాప్‌కార్న్‌పై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. క్యారమెల్ పాప్‌కార్న్‌పై మాత్రం 18 శాతం పన్ను విధిస్తారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆర్థికంగా ఊరట పొందుతాయి.