పెళ్లి కొడుకు వస్తాడని ఎదురుచూస్తూనే ఉన్న వధువు.. తీరా పెళ్లికొడుకేమో..

Groom disappeared on wedding day. పెళ్లి కొడుకు వస్తాడని పెళ్లి పీఠలపై ఎదురుచూస్తూ ఉంది వధువు.. ముహూర్తం టైమ్ దగ్గర పడుతూ

By M.S.R  Published on  1 Feb 2022 4:31 PM IST
పెళ్లి కొడుకు వస్తాడని ఎదురుచూస్తూనే ఉన్న వధువు.. తీరా పెళ్లికొడుకేమో..

పెళ్లి కొడుకు వస్తాడని పెళ్లి పీఠలపై ఎదురుచూస్తూ ఉంది వధువు.. ముహూర్తం టైమ్ దగ్గర పడుతూ ఉందని కుటుంబ సభ్యుల్లో ఒక టెన్షన్..! కానీ పెళ్లి కొడుకు మాత్రం వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు. ఉజ్జయినిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి సమయంలో వధువు పెళ్లి కొడుకు ఊరేగింపుగా వస్తాడని వేచి చూస్తూ ఉండిపోయింది. వరుడు మాత్రం మరొక అమ్మాయితో వెళ్ళిపోయాడు. ఉజ్జయిని జిల్లాలోని బమోరా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపుకు ముందు వరుడు అదృశ్యమైన సంఘటన ఇక్కడ వెలుగు చూసింది. వధువు తండ్రి వరుడి కుటుంబం వరకట్నం తీసుకుందని ఆరోపించాడు.

వధువు ఇంటి వద్ద ఉన్న బంధువులందరూ పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వరుడు ఎవరికీ ఏమీ చెప్పకుండా అదృశ్యమయ్యాడు. వరుడి కుటుంబం 25 లక్షల రూపాయలు, కారు అడిగాడని అమ్మాయి తండ్రి ఆరోపించారు. పెళ్లికి ముందే వరుడి కుటుంబీకులు ఈ డిమాండ్‌ పెట్టారని, డిమాండ్‌ను నెరవేర్చకుంటే పెళ్లి చేసుకోనని వరుడి తరపు వారు బెదిరించారని వధువు తండ్రి చెబుతున్నారు. అయితే వరుడు మరో అమ్మాయితో పారిపోయాడని అదనపు ఎస్పీ అమరేంద్ర సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.

మహేంద్ర కుమార్ సిందాల్ కుమార్తె కాజల్ వివాహం భోపాల్ లోయలోని చింతామన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విలేజ్ బమోరాలో జరగాల్సి ఉంది. అజయ్ పలాసియాతో కాజల్ పెళ్లి ఫిక్స్ అయింది. అజయ్ దేవాస్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఇంజనీర్ గా ఉన్నాడు. వరుడు అదృశ్యమైన తర్వాత అన్ని చోట్లా వెతికినా అతను కనిపించకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Next Story