పాత వాహనాలపై 'గ్రీన్ టాక్స్' విధించేందుకు రంగం సిద్ధం
Green tax mooted for personal vehicles older than 15 years. పాత వాహనాలపై గ్రీన్ టాక్స్ విధించేందుకు రంగం సిద్ధమైంది.
By Medi Samrat
పాత వాహనాలపై గ్రీన్ టాక్స్ విధించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. కాలం చెల్లిన వాహనాలు, అలాగే కాలుష్య వాహనాలను దశలవారీగా తొలగించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ గ్రీన్ టాక్స్ నిర్ణయం తీసుకున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. కాలం చెల్లిన వాహనాలపై విధించే హరిత పన్ను ద్వారా వసూలు చేసే మొత్తాలను కాలుష్యాన్ని నివారించేందుకు వినియోగించాలని నిర్ణయంచారు.
దశల వారిగా తొలగింపు..
అయితే కాలం చెల్లిన వాహనాల కారణంగా కాలుష్యం అధికంగా పెరిగిపోతున్ననేపథ్యంలో వాటిని దశల వారీగా తొలగించేందుకు రంగం సిద్దం అవుతోంది. ప్రస్తుతం ప్రతిపాదన రూపంలో ఉన్న ఆదేశాలకు అధికారికంగా అనుమతి తెలియజేయడానికి ముందు అన్ని రాష్ట్రాలకు సంప్రదించన్నారు. 'గ్రీన్ టాక్స్' విధించడం వల్ల పాత వాహనాలను ఉపయోగించకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు.15 ఏళ్లకు పైబడిన ప్రైవేటు వాహనాలతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలలో కాలం చెల్లిన కార్లు డీరిజిస్టర్ చేసి స్కాప్ చేయనున్నారు. ప్రభుత్వ వాహనాల స్కాప్‌జ్ విధానం 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.
కాగా, వాహనాల ఫిట్‌నెస్ ధృవీకరణ పునరుద్దరణ సమయం 8 సంవత్సరాల కంటే పాత వాహనాలకు గ్రీన్ టాక్స్ వసూలు చేయాలని ప్రతిపాదనలో తెలిపింది కేంద్రం. ఇలా గ్రీన్ టాక్స్ రూపంలో వసూలు చేసే మొత్తం రహదారి పన్నులో 10 శాతం నుంచి 25 శాతం మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక వ్యక్తిగత వానాల విషయానికొస్తే 15 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పునరుద్దరించే సమయంలో గ్రీన్ టాక్స్ విధించనున్నారు.