రాజధానిలో గ్రేప్‌-4 అమ‌లు.. ఆన్‌లైన్‌లోనే క్లాసులు.. 50 శాతం ఉద్యోగులు ఇంటికే ప‌రిమితం.. వాటిపై నిషేదం..!

రాజధానిలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అటువంటి పరిస్థితిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) నాల్గవ దశ నేటి నుండి అమలులోకి వచ్చింది. ఉదయం 8 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

By Medi Samrat  Published on  18 Nov 2024 9:44 AM IST
రాజధానిలో గ్రేప్‌-4 అమ‌లు.. ఆన్‌లైన్‌లోనే క్లాసులు.. 50 శాతం ఉద్యోగులు ఇంటికే ప‌రిమితం.. వాటిపై నిషేదం..!

రాజధానిలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అటువంటి పరిస్థితిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) నాల్గవ దశ నేటి నుండి అమలులోకి వచ్చింది. ఉదయం 8 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని గమనించిన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) ఈ నిర్ణయం తీసుకుంది. గ్రేప్‌-4 అమ‌లులో ఉన్న కార‌ణంగా భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. నిత్యావసర సరుకులను తరలించే ట్రక్కులను అనుమతించనున్నారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోని 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆన్‌లైన్‌లో విద్యనభ్యసించాలని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ రాష్ట్రాల ప్రభుత్వాలకు సిఫార్సు చేశారు.

మరోవైపు ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయిని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్వం 6 నుండి 11 తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. నిర్ణయం ప్రకారం.. 10, 12 తరగతులు మునుపటిలాగే కొనసాగుతాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయి. ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై పూర్తిగా నిషేధం విధించారు. అయితే, నిత్యావసర సరుకులు, ఎల్‌ఎన్‌జి, సిఎన్‌జి,ఎలక్ట్రిక్ ట్రక్కులను తీసుకువెళ్లే ట్రక్కులు మాత్రమే అనుమతించబడతాయి.

అలాగే గ్రేప్-4 కింద ఢిల్లీలోకి కాలుష్యకారక ట్రక్కులు,వాణిజ్య నాలుగు చక్రాల వాహనాల ప్రవేశంపై నిషేధం ఉంటుంది. ఈ సమయంలో ఢిల్లీ చుట్టుపక్కల ఇతర రాష్ట్రాల నుండి సిఎన్‌జి, ఎలక్ట్రిక్, బిఎస్ -6 వాహనాలు మాత్రమే లోనికి అనుమతించబడతాయి. రాజ‌ధానిలో వాయు కాలుష్యం చాలా తీవ్రమైన కేటగిరీ స్థాయికి చేరుకుంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రానున్న రోజుల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) చాలా తీవ్రమైన కేటగిరీలో ఉండవచ్చు. AQI 450 కంటే ఎక్కువ ఉంటే తీవ్రంగా పరిగణిస్తారు. AQI 450 దాటితేనే GRAP-4 దశ అమలు చేస్తారు.

Next Story