న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ పేరును కేంద్ర ప్రభుత్వం శనివారం 'అమృత్ ఉద్యాన్'గా మార్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'అమృత్ మహోత్సవ్' థీమ్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా మాట్లాడుతూ.. '75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'గా జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి భవన్ గార్డెన్స్‌కు రాష్ట్రపతి భవన్‌కు అమృత్ ఉద్యాన్' అని పేరు పెట్టారని వివరించారు. జనవరి 31 నుంచి అమృత్ ఉద్యాన్‌లోకి ప్రజలను అనుమతించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ‘‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ’’ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొఘల్ గార్డెన్స్ పేరు మార్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమృత్ ఉద్యాన్‌ను ప్రారంభించనున్నారు. సాధారణంగా, పుష్పాలు పూర్తిగా వికసించే సమయమైన ఫిబ్రవరి నుండి మార్చి వరకు ఈ ఉద్యానవనాన్ని ప్రజల సందర్శన కోసం తెరిచి ఉంటుంది. ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంచిన రెండు నెలల విండోతో పాటు, రైతుల, దివ్యంగులు వంటి ప్రత్యేక బృందాలు వీక్షించేందుకు గార్డెన్‌ను తెరిచి ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోందని నవికా గుప్తా తెలిపారు. మొఘల్ గార్డెన్స్ సాధారణంగా ప్రజల సందర్శనార్థం ప్రతీ సంవత్సరం ఒక నెల తెరుస్తారు.