ఎల్ఐసీ సీఈఓగా సిద్ధార్థ మొహంతీ

Govt appoints Siddhartha Mohanty as LIC chairperson till June 2024. దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) సీఈఓగా

By Medi Samrat  Published on  28 April 2023 12:00 PM GMT
ఎల్ఐసీ సీఈఓగా సిద్ధార్థ మొహంతీ

Siddhartha Mohanty


దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) సీఈఓగా సిద్ధార్థ మొహంతీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం సిద్ధార్థ మొహంతిని వచ్చే ఏడాది జూన్ వరకు ఎల్ఐసీ చైర్మన్‌గా, ఆ తర్వాత ఒక సంవత్సరానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించింది. ఎల్‌ఐసీలో నలుగురు మేనేజింగ్ డైరెక్టర్‌లలో ఒకరైన మొహంతి ఇప్పటికే మార్చిలో మూడు నెలలకు చైర్మన్‌గా నియమితులయ్యారు.

ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ, ఎల్ఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా 2025, జూన్ 7 వరకు కొనసాగుతారని కేంద్రం పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో కేంద్రం మొహంతీని మూడు నెలల పాటు తాత్కాలిక సీఈఓగా నియమించింది. అదే సమయంలో ద ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో(ఎఫ్‌ఎస్‌ఐబీ) ఎల్ఐసీ చైర్మన్ పదవికి సిఫార్సు చేసింది. ఎల్ఐసీలోని నలుగురు ఎండీల నుంచి ఎఫ్ఎస్ఐబీ ఛైర్మన్‌ను ఎంపిక చేస్తుంది. దీనిపై తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఎల్ఐసీ సీఈఓగా ఉన్న ఎంఆర్ కుమార్ పదవీకాలం 2022, మార్చిలో ముగిసింది. సిద్ధార్థ మొహంతీ 2021, ఫిబ్రవరి నుంచి ఎల్ఐసీ ఎండీగా ఉన్నారు. దానికి ముందు ఆయన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈఓగా చేశారు.


Next Story