తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ్లాల‌నుకునేవారికి శుభ‌వార్త‌.. ఒక్కొక్క‌రికి రూ.12వేలు ఇవ్వ‌నున్న ప్ర‌భుత్వం

Government will give Rs 12 thousand to pilgrimage. శుభ‌వార్త‌ యూపీ ప్రభుత్వం తీరతాయాత్ర వెళ్లే ప్రైవేట్ , చిరు ఉద్యోగులకు 12 వేళా రూపాయలు ఇవ్వబోతుంది.

By Medi Samrat  Published on  1 Jan 2021 11:02 AM GMT
pilgrimage

ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ్లాలంటే.. అప్ప‌టి వ‌ర‌కు దాచుకున్న డ‌బ్బుతోనే.. అప్పుచేసో వెళ్లి వ‌స్తుంటారు. ఇక నుంచి ఆక‌ష్టాలు తీర‌నున్నాయి. తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ్లే కార్మికులకు ఒక్కొక్క‌రికి రూ.12వేలు ఇవ్వ‌నున్నారు. అయితే.. ఇది అన్ని రాష్ట్రాల‌కు చెందిన వారికి కాదండోయ్‌.. కేవ‌లం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాసుల‌కు మాత్ర‌మే.

ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వామి వివేకానంద ఇతిహాసిక్ పర్యటన్ యాత్రా యోజనను తీసుకొచ్చింది. ఈ నెల‌ 24న యూపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ప‌థ‌కానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను ప్రారంభించనుంది. రాష్ట్ర కార్మిక సంక్షేమ మండలిలో న‌మోదు చేసుకున్న‌ 1.5 కోట్ల మంది కార్మికులకు ఈ పథకం కింద ల‌బ్ధి చేకూర‌నుంది.

రాష్ట్రంలోని వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీలు, వర్క్ షాప్‌లలో పనిచేస్తున్న సిబ్బంది (కార్మికులు, చిరుద్యోగులు) కోసం ప్ర‌భుత్వం ఈ నూత‌న‌ పథకాన్ని తీసుకొచ్చింద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ సునీల్ భరాలా చెప్పారు. ప్ర‌భుత్వం ఎంపిక చేసిన ప్రదేశాలకు వెళ్ల‌డం కోసం కార్మికులు, చిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.12,000 చొప్పున‌ చెల్లించ‌నున్నారు. అయోధ్య, మథుర, ప్రయాగ్‌రాజ్, వారణాసి, హస్తినాపూర్, గోరఖ్‌నాథ్, శాకంబరీ దేవి దేవాలయం, వింధ్యవాసినీ దేవి దేవాలయం, ఆగ్రా యూపీ ప్ర‌భుత్వం ఎంపిక‌చేసిన యాత్రా ప్ర‌దేశాల్లో ఉన్నాయి.


Next Story
Share it