స్కూటర్‌పై వెళ్తున్న బీజేపీ నాయకురాలి బంగారు గొలుసును లాక్కొని పోయాడు

బైక్‌పై వచ్చిన దుండగుడు స్కూటర్‌పై వెళ్తున్న బీజేపీ నాయకురాలు రాజుల్ తపాడియా బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు

By Medi Samrat  Published on  7 Nov 2024 8:45 PM IST
స్కూటర్‌పై వెళ్తున్న బీజేపీ నాయకురాలి బంగారు గొలుసును లాక్కొని పోయాడు

బైక్‌పై వచ్చిన దుండగుడు స్కూటర్‌పై వెళ్తున్న బీజేపీ నాయకురాలు రాజుల్ తపాడియా బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఈ ఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది. వజ్రాల లాకెట్ ఉన్న గొలుసు విలువ దాదాపు రూ.2.5 లక్షలు ఉంటుందని మహిళా మోర్చా నాయకురాలు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో దుండగుడు హెల్మెట్‌ పెట్టుకున్నాడు. రాజుల్ స్కూటర్‌ను వెనుక నుంచి కొంత దూరం వెంబడిస్తూ కనిపించాడు. కొద్దిసేపటి తర్వాత, దుండగుడు రాజుల్‌ను ఓవర్‌టేక్ చేసి ఆమె చైన్ ను లాక్కొని అక్కడి నుండి పారిపోయాడు. చైన్ స్నాచింగ్ సమయంలో రాజుల్ ద్విచక్రవాహనంతో సహా రోడ్డుపై పడిపోయింది. కొందరు బాటసారులు రాజుల్‌ను లేవడానికి సహకరించగా, మరికొందరు చైన్ స్నాచర్‌ను వెంబడించేందుకు ప్రయత్నించారు. అయితే నిందితుడు తప్పించుకోగలిగారు. తపాడియా ముఖం, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.

Next Story