Video : ప్రాణాలను పణంగా పెట్టి మరీ రీల్స్ చేస్తారా..? జైల్లో వ్యూస్ లెక్క‌పెట్టుకోండి..!

మహారాష్ట్ర లోని పూణేలో శిథిలావస్థలో ఉన్న ఆలయ భవనంపై రీల్స్ ను రికార్డు చేయడం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వారిపై పోలీసులు కన్నెర్రజేశారు.

By Medi Samrat  Published on  21 Jun 2024 3:15 PM IST
Video : ప్రాణాలను పణంగా పెట్టి మరీ రీల్స్ చేస్తారా..? జైల్లో వ్యూస్ లెక్క‌పెట్టుకోండి..!

మహారాష్ట్ర లోని పూణేలో శిథిలావస్థలో ఉన్న ఆలయ భవనంపై రీల్స్ ను రికార్డు చేయడం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వారిపై పోలీసులు కన్నెర్రజేశారు. భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి, మహిళను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను మిహిర్ గాంధీ (27), అతని స్నేహితురాలు మినాక్షి సలుంఖే (23)గా గుర్తించగా.. రీల్‌ను రికార్డు చేసిన మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

“మాకు వీడియో గురించి సమాచారం వచ్చిన తర్వాత, మేము విచారణ ప్రారంభించాము. నిందితులను కనుగొనగలిగాము. వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అరెస్టు చేశారు. వారిపై IPC సెక్షన్ 336, ఇతరాల కింద కేసు నమోదు చేశాం, ”అని భారతీ విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ దశరత్ పాటిల్ మీడియాకి తెలిపారు. ఈ వైరల్ వీడియో అబ్బాయి అమ్మాయిని గట్టిగా పట్టుకోగా.. ఆమె కిందకు వేలాడుతూ కనిపించింది. ఈ వీడియోను పలు యాంగిల్స్ లో రికార్డు చేశారు. ఇది కొన్ని నిమిషాల్లో వైరల్ గా మారగా.. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వచ్చాయి. దీంతో పూణే పోలీసులు రంగంలోకి దిగి వీరిని అరెస్ట్ చేశారు. రీల్స్ లో వ్యూస్ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధమవుతున్నారు. చిన్న పొరపాటు జరిగిందంటే చాలు ప్రాణాలు పోతాయనే విషయం మరిచి ప్రవర్తిస్తూ ఉన్నారు.

Next Story