షిండే అంకుల్‌.. సీఎం కావ‌డం ఎలా..? న‌న్నూ గువాహ‌టీ తీసుకువెళ‌తారా..? ఏడేళ్ల చిన్నారి ప్ర‌శ్న‌

Girl Asks Eknath Shinde If He Would Take Her To Guwahati.మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండేను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2022 5:31 AM GMT
షిండే అంకుల్‌.. సీఎం కావ‌డం ఎలా..? న‌న్నూ గువాహ‌టీ తీసుకువెళ‌తారా..? ఏడేళ్ల చిన్నారి ప్ర‌శ్న‌

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండేను ఏడేళ్ల బాలిక క‌లిసింది. షిండే అంకుల్‌.. సీఎం కావ‌డం ఎలా..? ఏమైనా స‌ల‌హాలు ఇవ్వండి అని అడిగింది. అంతేనా.. త‌న‌ను కూడా గువాహ‌టికి తీసుకువెళ్తారా..? అని అడిగింది. దీంతో ఏం చెప్పాలో తెలియ‌క షిండే చిరున‌వ్వుతో బ‌దులు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. ముంబైలోని నంద‌న‌వ‌న్ బంగ్లాలో సీఎం ఏక్‌నాథ్ షిండేను త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఏడేళ్ల చిన్నారి అన్న‌డా డామ్రే క‌లిసింది. త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన బాలిక‌తో కాసేపు ముచ్చ‌టించారు సీఎం షిండే. ఈ సంద‌ర్భంగా చిన్నారి మాట్లాడుతూ 'షిండే అంకుల్‌.. 'మీలాగా సీఎం కావడం ఎలా? అస్సాంలో వరదలు వచ్చినప్పుడు, మీరు ప్రజలకు సహాయం చేయడానికి నీటిలో నడిచారు. మీలాగా వరద బాధిత ప్రజలను ఆదుకోవడం ద్వారా నేను ముఖ్యమంత్రిని కాగలనా? 'అంటూ అమాయకంగా అడిగింది ఆ చిన్నారి బాలిక‌. దీనికి సీఎం షిండే బ‌దులు ఇస్తూ 'అవును నువ్వు త‌ప్ప‌కుండా సీఎం అవుతావు' అని అన్నారు. మ‌ర‌లా ఆ బాలిక దీపావళి సెలవుల్లో తననూ గౌవాహ‌టికి తీసుకెళ్లాలని సీఎం షిండేను అభ్యర్థించింది.

చిన్నారి నుంచి ఈ ప్ర‌శ్న వ‌స్తుంద‌ని ఊహించ‌ని షిండే పాటు అక్క‌డ ఉన్న‌వారు ఆశ్చ‌ర్య పోయారు. అనంత‌రం షిండే త‌ప్ప‌కుండా మ‌నం వెలుదాం. అక్క‌డున్న కామాఖ్య గుడికి వెలుదామా అని అడుగ‌గా దానికి ఆ చిన్నారి అవున‌ని స‌మాధానం చెప్పింది. అప్ప‌డు షిండే త‌న ప‌క్క‌న ఉన్న వారితో ఈ అమ్మాయి చాలా తెలివైన‌ది అంటూ చిరున‌వ్వులు చిందించారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో గ‌త నెల కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 39 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగరేసిన ఏక్‌నాథ్‌ షిండే.. గుజరాత్‌, అక్కడి నుంచి గువాహతి(అస్సాం)కు తరలివెళ్లారు. ఓ హోటల్‌లో బస చేసి సస్పెన్స్‌కు తెర లేపారు. దీంతో మెజార్టీ కోల్పోయిన ఠాక్రే అధికారం కోల్పోయారు. అనంత‌రం ముంబైకి వ‌చ్చిన షిండే బీజేపీ మ‌ద్ద‌తుతో మ‌హారాష్ట్ర సీఎం అయ్యారు.

Next Story