గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ల సెటైర్లు
Ghulam Nabi Azad's DNA has been Modi-fied. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చేసిన విమర్శలపై గులాం నబీ ఆజాద్‌పై
By Medi Samrat Published on 26 Aug 2022 8:15 PM ISTకాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చేసిన విమర్శలపై గులాం నబీ ఆజాద్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక ఆయన రాజీనామాకు రాజ్యసభ పదవీకాలం ముగిసే సమయానికి ముడిపెట్టింది కాంగ్రెస్. కాంగ్రెస్ కు గులాం నబీ ఆజాద్ ద్రోహం చేశారని.. నిజమైన బుద్ధిని తెలియజేయడమే కాకుండా ఆయన DNA "మోడీ-ఫైడ్" అని ఆరోపించింది.
"కాంగ్రెస్ నాయకత్వం అత్యంత గౌరవప్రదంగా వ్యవహరించిన వ్యక్తి.. తన దుర్మార్గపు వ్యక్తిగత స్వార్థం కోసం దానిని మోసం చేసాడు, ఇది అతని నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసింది. GNA(గులాం నబీ ఆజాద్) DNA మోడీ-ఫైడ్ చేయబడింది" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ ట్వీట్ చేశారు."A man who has been treated with the greatest respect by the Congress leadership has betrayed it by his vicious personal attacks which reveals his true character. GNA's DNA has been Modi-fied," అని ట్వీట్ చేశారు.
పార్టీ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా కూడా ఆజాద్‌పై విరుచుకుపడ్డారు. ఆయన రాజీనామాను రాజ్యసభ పదవీకాలం ముగియడానికి ముడిపెట్టారు. "మీ రాజ్యసభ పదవీకాలం ముగిసిన వెంటనే, మీరు అశాంతికి గురయ్యారు. మీరు ఒక సెకను కూడా పదవి లేకుండా ఉండలేరు" అని ఖేరా అన్నారు. సంస్థాగత ఎన్నికలకు ముందు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పార్టీల పదవులకు ఆజాద్ శుక్రవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.