విద్యార్థులతో టాయిలెట్లను క్లీన్‌ చేయించిన ప్రధానోపాధ్యాయురాలు.. సీఎం సీరియస్‌

పిల్లల చేత బలవంతంగా మరుగుదొడ్లు శుభ్రం చేయించింది ప్రధానోపాధ్యాయురాలు. ఈ ఘటనపై స్పందించిన సీఎం సీరియస్‌ అయ్యారు.

By అంజి  Published on  24 Dec 2023 1:51 AM GMT
school toilets, students, Karnataka, CM Siddaramaiah

విద్యార్థులతో టాయిలెట్లను క్లీన్‌ చేయించిన ప్రధానోపాధ్యాయురాలు.. సీఎం సీరియస్‌

పిల్లల చేత మరుగుదొడ్లు శుభ్రం చేశారన్న ఆరోపణలపై బెంగళూరులోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి స్పందించారు. విద్యార్థుల చేత మరుగుదొడ్లను శుభ్రం చేయించడం సహించరాని చర్య అని సీఎం సిద్ధరామయ్య శనివారం అన్నారు. "పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేయమని విద్యార్థులను బలవంతం చేయమని ప్రధానోపాధ్యాయురాలు బలవంతం చేయడం శోచనీయమైన చర్య, అలాంటి చర్యలు సహించలేనివి" అని ముఖ్యమంత్రి అన్నారు.

బెంగళూరులోని ఆండ్రహళ్లి ప్రభుత్వ మోడల్‌ హయ్యర్‌ ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవమ్మను బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నమోదైన కేసులకు బాధ్యులైన ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే తక్షణ చర్యలు తీసుకున్నారు. ఇతర పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రాథమిక విద్యాశాఖ మంత్రిని ఆదేశించినట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

''పాఠశాలలు, కళాశాలల హాస్టళ్లపై నిఘా ఉంచాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి కూడా తెలియజేశాను. ప్రతి పాఠశాలలో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, రోజూ మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు సిబ్బందిని నియమించాలని ప్రాథమిక విద్యాశాఖ మంత్రికి సూచించాను. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారుల నుంచి సర్వే నిర్వహించి నివేదికలు తీసుకోవాలి'' అని కూడా ఆదేశించారు

ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి రావడంతో లక్ష్మీదేవమ్మను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. 6వ తరగతి విద్యార్థులు పాఠశాల మరుగుదొడ్లను యాసిడ్‌తో శుభ్రం చేయాలని ప్రధానోపాధ్యాయురాలు ఆదేశించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల దగ్గర ఆందోళనకు దిగారు.

Next Story