గౌతమ్‌ గంభీర్‌ను చంపుతామంటూ.. ఐఎస్‌ఐఎస్‌ కశ్మీర్‌ నుండి బెదిరింపులు..!

Gautam Gambhir gets death threat from ISIS Kashmir. మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌కు చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. తనకు ఈ మెయిల్స్‌ రూపంలో ఐఎస్ఐఎస్‌ కశ్మీర్ నుండి

By అంజి  Published on  24 Nov 2021 12:40 PM IST
గౌతమ్‌ గంభీర్‌ను చంపుతామంటూ.. ఐఎస్‌ఐఎస్‌ కశ్మీర్‌ నుండి బెదిరింపులు..!

మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌కు చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. తనకు ఈ మెయిల్స్‌ రూపంలో ఐఎస్ఐఎస్‌ కశ్మీర్ నుండి బెదిరింపులు వచ్చాయని గౌతం గంభీర్‌ చెప్పారు. మంగళవారం రాత్రి గంభీర్‌ ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించాడు. ముప్పు ఉన్న నేపథ్యంలో తగిన భద్రత ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని రాజేంద్రనగర్‌లో తన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గౌతమ్ గంభీర్ నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ బెదిరింపులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఫిర్యాదు ఇచ్చారని, పోలీసులు చర్యలు చేపట్టారని, తాము దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ సెంట్రల్‌ డీసీపీ శ్వేతా చౌహాన్‌ పేర్కొన్నారు. ఈ మెయిల్‌ అడ్రస్‌ను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు. గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్‌ను ధృవీకరించడంతోపాటు విచారణ తర్వాత పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. గౌతమ్‌ గంభీర్‌ 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున ఆడారు. ఆ తర్వాత 2018లో రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.


Next Story