2021లో ఢిల్లీలోని రోహిణి కోర్టు షూటౌట్‌లో నిందితుడిగా ఉన్న పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియాను చంపేశారు. మంగళవారం ఉదయం మండోలి జైలులో ప్రత్యర్థి ముఠా సభ్యుల బృందం ఇనుప రాడ్‌తో దాడి చేసింది. ఆ తర్వాత పదునైన సూది లాంటి వస్తువుతో 40 సార్లు పొడిచారు. గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగి హత్యకు ప్రతీకారంగా టిల్లు హత్య జరిగినట్లు భావిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. గోగి గ్యాంగ్‌లో భాగమైన నలుగురు గ్యాంగ్‌స్టర్లు జైలు నంబర్-9లోని మొదటి అంతస్తులో ఉన్నారు. ఈ హత్య చేయడానికి తమ సెల్‌లోని ఐరన్ గ్రిల్‌ను కత్తిరించి బెడ్ షీట్ సహాయంతో గ్రౌండ్ ఫ్లోర్‌కు దూకారు. అత్యంత భద్రత ఉండే జైలులో ఉన్న టిల్లూను హత్య చేశారు.
సెప్టెంబర్ 24, 2021న, ఢిల్లీలోని రోహిణి కోర్టులో న్యాయవాదుల వేషంలో వచ్చిన టిల్లు ఇద్దరు సహచరులు జితేందర్ గోగి కోర్టులో కాల్చి చంపారు. గోగి అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు షూటర్లను కోర్టు హాలులోనే పోలీసులు కాల్చిచంపారు. దాదాపు 10 సంవత్సరాలుగా గోగి-టిల్లు గ్యాంగ్ ల మధ్య గ్యాంగ్ వార్ నడిచింది. టిల్లు దారుణ హత్యలో గ్యాంగ్‌స్టర్ రోహిత్ మోయి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. రోహిత్ మోయి గోగికి కుడి భుజమని నమ్ముతారు. గోగి గ్యాంగ్‌లోని చాలా మంది గ్యాంగ్‌స్టర్లు తీహార్ జైలులో ఉన్నారు. గోగి గ్యాంగ్ లారెన్స్ బిష్ణోయ్, అతని అనుచరులతో కలిసి పనిచేసినట్లు కూడా చెబుతున్నారు.