ఢిల్లీ విమానాశ్రయ అధికారులు శనివారం మధ్యాహ్నం ఫుల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. దుబాయ్‌కి వెళ్లాల్సిన ఫెడెక్స్ విమానాన్ని టేకాఫ్ అయిన వెంటనే పక్షి ఢీకొంది. దీంతో ఢిల్లీ విమానాశ్రయ అధికారులు పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. సాంకేతిక నిపుణులు విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా అని తనిఖీ చేయవచ్చు. విమానాలు ఎగురుతున్న సమయంలో పక్షులు ఢీకొన్నప్పుడు ఊహించని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. విమానానికి సాంకేతిక సమస్యలు కలిగిస్తాయి.
ఫిబ్రవరిలో, సూరత్ నుండి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో పక్షులు ఢీకొట్టడంతో అహ్మదాబాద్‌కు మళ్లించాల్సి వచ్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కూడా ఈ సంఘటనను ధృవీకరించింది. విమానం అహ్మదాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.