ఢిల్లీ విమానాశ్రయంలో తుపాకీ క‌ల‌క‌లం

Customs seized pistol in Delhi airport.దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఎయిర్‌పోర్టు(విమానాశ్ర‌యం)లో తుపాకీ క‌ల‌క‌లం రేగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2022 10:08 AM IST
ఢిల్లీ విమానాశ్రయంలో తుపాకీ క‌ల‌క‌లం

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఎయిర్‌పోర్టు(విమానాశ్ర‌యం)లో తుపాకీ క‌ల‌క‌లం రేగింది. ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద తుపాకీని గుర్తించిన క‌స్ట‌మ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి ఢిల్లీకి ఓ విమానం వ‌చ్చింది. ప్ర‌యాణీకుల‌ను క‌స్ట‌మ్స్ అధికారులు త‌నిఖీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ప్ర‌యాణికుడి చెక్ ఇన్ బ్యాగ్‌లో పిస్ట‌ల్‌తో పాటు రెండు మ్యాగ‌జైన్‌ల‌ను గుర్తించారు. వెంట‌నే తుపాకీని స్వాధీనం చేసుకోవ‌డంతో పాటు ప్ర‌యాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. చెక్ ఇన్ బ్యాగ్‌లో తుపాకి ఎలా తీసుకువ‌చ్చానే కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దుబాయ్‌లో సెక్యూరిటీ లోపంగా బావిస్తున్నారు. పిస్టల్ తో ఉన్న బ్యాగ్ ను విమానం లోపలికి ఎలా అనుమతించారన్న దానిపై లోతుగా విచారణ చేప‌ట్టారు. ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో దుబాయ్ నుండి ఢిల్లీ వచ్చిన విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

Next Story