మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Fuel Prices Hike In India. దేశంలో రోజురోజుకు చమురు ధరలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా 12 రోజుల పాటు
By Medi Samrat Published on 23 Feb 2021 11:36 AM ISTదేశంలో రోజురోజుకు చమురు ధరలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా 12 రోజుల పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ మంగళవారం కూడా పెరిగాయి. దేశీయంగా చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 38 పైసల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు సంస్థలు. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల వరకు పెంచంతో లీటర్ పెట్రోల్ ధర రూ.90.93కి చేరగా, డీజిల్ ధర రూ. 81.32గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.97.34కి చేరగా, డీజిల్ ధర రూ.88.44కు చేరింది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.93.98 ఉండగా, డీజిల్ రూ.86.21కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్ రూ.92.90 ఉండగా, డీజిల్ రూ. 86.31కి చేరింది. అలాగే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.36 పైసలు, డీజిల్‌పై రూ.38 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.54, డీజిల్ ధర రూ.88.69కి చేరింది. ఇదిలా ఉండగా, పెరుగుతున్న చమురు ధరలతో దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కాగా గత 54రోజుల్లో చమురు ధరలు 25 సార్లు పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7.50 మేర పెరిగాయి.
కాగా, దేశంలో రికార్డ్ స్థాయిలో చమురు ధరలు నమోదు కావడంతో ప్రజలు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ప్రజల జేబులను ఖాళీ చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బాగా పనిచేస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే సెటైర్లు వేశారు. క్రూడాయిల్ ధరలు పెరగకున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఏంటని మండిపడుతున్నారు. ఇక రాబర్ట్ వాద్రా సోమవారం తన కార్యాలయానికి సైకిల్‌పై వెళ్లి ఇంధన ధరల పెరుగుదలకు నిరసన తెలిపారు. అలాగే సోనియా గాంధీ సైతం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు.