ఆదివారం కూడా ఆగని పెట్రో ధరలు.!
Fuel prices also rose on Sunday. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలను పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.09
By అంజి Published on 17 Oct 2021 8:02 AM ISTఆదివారం లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలను పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.09, లీటర్ డీజిల్ ధర రూ.103.18కు పెరిగింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండడంతో.. దేశంలోని ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలోని హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరమైన వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.61, లీటర్ డీజిల్ రూ.102.71కిగా ఉంది. నిజామాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.110.50, లీటర్ డీజిల్ ధర రూ.104.31కి చేరుకుంది. తాజా పెరిగిన ధరలతో ఏపీలోని గంటూరు నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.86 కు చేరగా లీటర్ డీజిల్ ధర రూ.104.31గా ఉంది. విశాఖపట్టణంలోనూ లీటర్ పెట్రోల్ రూ.110.93, లీటర్ డీజిల్ రేటు రూ103.42కు చేరుకుంది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.49, లీటర్ డీజిల్ ధర రూ.94.22
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.43, లీటర్ డీజిల్ ధర రూ.102.15
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.01, లీటర్ డీజిల్ ధర రూ.98.92
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.109.16, లీటర్ డీజిల్ ధర రూ.100
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.43, లీటర్ డీజిల్ ధర రూ.97.68
ఇక దేశంలోనే రాజస్థాన్‌లోని గంగానగర్‌లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.117.72, డీజిల్ ధర రూ.108.53గా ఉంది. రోజు రోజుకి పెట్రో ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి రోజు ఇలాగే పెట్రో ధరలు పెరిగితే.. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పవు