ఓ గ్రామంపై నక్కలు ఒక్క సారిగా దాడి చేశాయి. ఏమి జరుగుతోందో ఏమో అని తెలుసుకునే లోపే వరుసగా మనుషులపై దాడి చేసుకుంటూ వెళ్లిపోయాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో నక్కల గుంపు దాడిలో కనీసం 38 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. హరీశ్‌చంద్రాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని హర్దాంనగర్ గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటనలో 38 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 20 మంది తీవ్ర గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 15 నుంచి 20 వరకు ఉన్న నక్కల గుంపు గ్రామంలోని పలు ఇండ్లపై దాడికి పాల్పడి అనేక మందిని గాయపరిచాయని పోలీసులు తెలిపారు. మనుషులు రెండు నక్కలను కొట్టి చంపేశారు. మిగతావి తప్పించుకు పారిపోయాయి.
ఆ గ్రామస్థులు మాట్లాడుతూ తెల్లవారుజామున సమయంలో 15-20 నక్కల గుంపు గ్రామంలోని అనేక మందిపై దాడి చేసింది. బయట ఉన్న వాళ్లపై ఇష్టం వచ్చినట్లు కొరకడం మొదలు పెట్టాయి. కనీసం 40 మంది గాయపడ్డాము.. అవి ఎందుకు దాడి చేస్తున్నాయో కూడా చాలా మందికి తెలియలేదని అన్నారు. కోపోద్రిక్తులైన గ్రామస్తులు రెండు నక్కలను కొట్టి చంపగా, మిగిలినవి తప్పించుకోగలిగారని పోలీసులు తెలిపారు. నక్కల దాడిలో మొత్తం 38 మంది గాయపడ్డారని.. వారందరికీ హరిశ్చంద్రపూర్ రూరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని హరిశ్చంద్రపూర్ 2 బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ బిజోయ్ గిరి తెలిపారు.