కేరళ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని నలుగురు కార్మికులు మృతి

కేరళలో కార్మికుల జీవితంలో రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం షోర్నూర్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటన సంచలనం రేపింది

By Medi Samrat  Published on  2 Nov 2024 8:30 PM IST
కేరళ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని నలుగురు కార్మికులు మృతి

కేరళలో కార్మికుల జీవితంలో రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం షోర్నూర్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. మృతులను తమిళనాడుకు చెందిన వల్లి, రాణి, లక్ష్మణ్‌ లుగా గుర్తించారు. మరో గుర్తుతెలియని వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న షోరనూర్ వంతెన సమీపంలోని రైల్వే ట్రాక్‌పై చెత్తను తొలగిస్తున్న సమయంలో న్యూఢిల్లీ-తిరువనంతపురం రైలు మధ్యాహ్నం 3.05 గంటలకు కార్మికులను ఢీకొట్టింది. పారిశుద్ధ్య విధుల కోసం రైల్వేతో ఒప్పందం చేసుకున్న కార్మికులు రైలు ఢీకొనడంతో ట్రాక్‌పై నుంచి కిందపడ్డారు. మూడు మృతదేహాలను వెలికి తీయగా, నాల్గవ మృతదేహాన్ని పక్కనే నదిలో పడినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Next Story