బీజేపీలో చేరిన.. ది గ్రేట్ కాలీ

Former wwe champion the great kali joined the bjp. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో వేడి రాజుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య త్రిముఖ పోటీతో ఎన్నికల రంగం వేడెక్కింది.

By అంజి  Published on  10 Feb 2022 4:22 PM IST
బీజేపీలో చేరిన.. ది గ్రేట్ కాలీ

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో వేడి రాజుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య త్రిముఖ పోటీతో ఎన్నికల రంగం వేడెక్కింది. అధికార కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడంపై సీరియస్ గా ఉంది. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని భావించగా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చన్నీని తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని అధిష్టించకూడదని భావించిన బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. ఇందులో భాగంగా ప్రముఖ రెజ్లర్, మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ గ్రేట్ కాలీ బీజేపీలో చేరారు. పంజాబ్ పోలీస్‌ శాఖలో అధికారిగా పనిచేసిన, గ్రేట్ ఖలీగా పేరుగాంచిన దలిప్ సింగ్ రానా 2000లో ప్రొఫెషనల్ రెజ్లర్‌గా మారారు. 4 హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆయన పంజాబ్ ఎన్నికల కోసం బీజేపీలో చేరారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.

Next Story