నటి గాయత్రి రఘురామ్ అన్నాడీఎంకేలో చేరారు. ఒకప్పుడు బీజేపీ సభ్యురాలిగా ఉన్న గాయత్రి రఘురామ్ శుక్రవారం చెన్నైలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో అన్నాడీఎంకేలో చేరారు. రాష్ట్రంలో బీజేపీ సాంస్కృతిక విభాగానికి నేతృత్వం వహించారు గాయత్రి. గత ఏడాది బీజేపీ నాయకుడు తిరుచ్చి సూర్య ఫోన్ రికార్డింగ్ వైరల్ అయ్యాక ఆమె బీజేపీకి దూరంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో మహిళలకు మర్యాద లేదని.. అందుకే తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సమక్షంలో గాయత్రి రఘురామ్ పార్టీ మార్పు అధికారికంగా జరిగింది. అన్నాడీఎంకేలోకి ప్రవేశించిన ఆమె తమిళనాడు రాజకీయాల్లో మరింత చురుకైన పాత్రను పోషించాలని భావిస్తూ ఉన్నారు. గాయత్రి రఘురామ్ వినోద పరిశ్రమ నుండి రాజకీయాలలోకి వచ్చారు. తమిళనాడులో సినిమా, టెలివిజన్ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు తమదైన ముద్ర వేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో గాయత్రి ఎలా రాణిస్తారో చూడాలి.