రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. శక్తికాంత దాస్ అపాయింట్‌మెంట్ ప్రధానమంత్రి పదవీకాలంతో పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందైతే అది కొనసాగుతుందని క్యాబినెట్ నియామకాల కమిటీ తెలిపింది.
NITI ఆయోగ్ సీఈఓ BVR సుబ్రహ్మణ్యం పదవీకాలం కూడా ఫిబ్రవరి 24, 2025 నుండి ఒక సంవత్సరం పొడిగించనున్నారు. 1987-బ్యాచ్‌కి చెందిన రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిని ఫిబ్రవరి 2023లో రెండేళ్లపాటు NITI ఆయోగ్ CEOగా నియమించారు. శక్తికాంత దాస్ డిసెంబర్ 2018 నుండి ఆరు సంవత్సరాల పాటు RBI చీఫ్‌గా ఉన్నారు. నాలుగు దశాబ్దాలలో వివిధ పాలనా రంగాలలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఆర్థిక, పన్నులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు మొదలైన రంగాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పదవులను చేపట్టారు.