భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేపటికే మన్మోహన్ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. 1932 సెప్టెంబర్ 26న ఇప్పటి పాకిస్తాన్‌లోని చక్వాల్‌లో మన్మోహన్ సింగ్ జన్మించారు. 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేశారు.
నెహ్రూ, ఇందిరా, మోదీ తరువాత అత్యధిక కాలం దేశ ప్రధానిగా కొనసాగారు. 33ఏళ్లపాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. 1991లో రాజ్యసభలో అడుగుపెట్టారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆర్థిక శాఖలో సలహాదారుగా, కార్యదర్శిగా, ఆర్బీఐ గవర్నర్‌గా కూడా పని చేశారు. మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మృతి ప్రముఖులు, దేశ ప్రజలు సంతాపం తెలియజేస్తున్నారు.