అధికారికంగా పార్టీని మొదలుపెట్టిన ప్రశాంత్ కిషోర్.. పేరేమిటంటే

రాజకీయవేత్తగా మారిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.

By Medi Samrat  Published on  2 Oct 2024 6:03 PM IST
అధికారికంగా పార్టీని మొదలుపెట్టిన ప్రశాంత్ కిషోర్.. పేరేమిటంటే

రాజకీయవేత్తగా మారిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయన తన పార్టీ పేరును "జన్ సూరాజ్ పార్టీ" అని తెలిపారు. బుధవారం పాట్నాలో అధికారికంగా పార్టీని ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో కిషోర్ మాట్లాడుతూ, పార్టీ గత రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని, ఇటీవల భారత ఎన్నికల సంఘం నుండి ఆమోదం పొందిందని వివరించారు. ఎన్నికల సంఘం అనుమతితో, వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సూరాజ్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని తెలిపారు.

ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బీహార్ అభివృద్ధికి రాబోయే దశాబ్దంలో రూ. 5 లక్షల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. అంతేకాకుండా బీహార్ విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పును తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మద్యపాన నిషేధంపై మాట్లాడుతూ ఏటా సుమారు రూ. 20,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతూ ఉందని.. తాము అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఆ డబ్బును విద్యా సంస్కరణల వైపు మళ్లించవచ్చని తెలిపారు. మద్య పాన నిషేధాన్ని తీసేసిన తర్వాత వచ్చే ఆదాయాన్ని రోడ్లు, నీరు, విద్యుత్ కోసం వాడుతామన్నారు. ఇది బీహార్‌లో కొత్త విద్యా వ్యవస్థను నిర్మించడానికి ఉపయోగిస్తామని అన్నారు.

Next Story