ఆయ‌న‌ కూడా జైలు నుంచి బయటకు వస్తారు : సిసోడియా

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్, అవినీతి కేసులో సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలు నుండి విడుదలయ్యారు

By Medi Samrat  Published on  9 Aug 2024 9:15 PM IST
ఆయ‌న‌ కూడా జైలు నుంచి బయటకు వస్తారు : సిసోడియా

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్, అవినీతి కేసులో సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలు నుండి విడుదలయ్యారు. విడుద‌ల అనంత‌రం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఉదయం బెయిల్ ఆర్డ‌ర్‌ వ‌చ్చింది. మీ ప్రేమ వల్లే నేను ఈరోజు బయటకు వచ్చానని.. బాబా సాహెబ్ చేసిన రాజ్యాంగం వల్లే నేను బయటపడ్డానని అన్నారు.

ఈ రాజ్యాంగం వల్లే మీ ప్రియతమ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలు నుంచి బయటకు వస్తారని.. నేను మీకు హామీ ఇస్తున్నాను.. జైలు తాళాలు పగలగొట్టి కేజ్రీవాల్‌ను విడుదల చేస్తామని అన్నారు.

మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన తర్వాత.. ఆప్ నేత‌లు స్వీట్లు పంచుకుని సెల‌బ్రేట్ చేసుకున్నారు. మనీష్ సిసోడియా బెయిల్ రావ‌డంపై మాట్లాడుడూ ఆప్ నాయకురాలు, మంత్రి అతిషి ఏడ్చారు. సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. 17 నెలల విలువైన కాలాన్ని ఎవరు ఇస్తారని ప్రశ్నించారు.

Next Story