తమిళనాడు రాజకీయాల్లో సంచలనం..డీఎంకేలో చేరిన మాజీ సీఎం

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 27 Feb 2026 10:47 AM IST

National News, Tamilnadu, Former CM Panneerselvam, CM MK Stalin, AIADMK, DMK

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం..డీఎంకేలో చేరిన మాజీ సీఎం

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఏఐఏడీఎంకే (AIADMK) మాజీ అధినేత, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ. పన్నీర్‌సెల్వం (OPS) అధికార డీఎంకే (DMK) పార్టీలో చేరారు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన డీఎంకే కండువా కప్పుకున్నారు.

2022లో ఏఐఏడీఎంకే నుండి బహిష్కరణకు గురైన పన్నీర్‌సెల్వం, గత మూడేళ్లుగా తిరిగి తన మాతృ సంస్థలో చేరడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో, తన అనుచరులతో కలిసి ఆయన డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. దివంగత జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న ఓపీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story