గోరఖ్‌నాథ్ ఆలయ సందర్శనలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఒక ఐదేళ్ల చిన్నారి వినూత్నమైన కానుకను అందించింది. కాన్పూర్‌కు చెందిన యశస్విని అనే బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎంను కలిసి, ఒక బొమ్మ బుల్డోజర్‌ను ఆయనకు బహుకరించింది.
ఈ ఆసక్తికర సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి ఇచ్చిన కానుకను ప్రేమతో స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్, తిరిగి దానిని ఆ పాపకే అందిస్తూ.. బాగా చదువుకోవాలని, ఆ బొమ్మతో ఆడుకోవాలని దీవించారు. నేరస్తుల ఆస్తుల కూల్చివేతకు సంబంధించి యోగి పాలనలో బుల్డోజర్ ఒక శక్తివంతమైన చిహ్నంగా మారిన నేపథ్యంలో, ఈ చిన్నారి చర్య అందరి దృష్టిని ఆకర్షించింది.