విషాదం.. డ్యామ్‌లో మునిగిన ఐదుగురు స్నేహితులు.. నలుగురి డెడ్‌బాడీలు వెలికితీత

రాజస్థాన్‌లోని జైపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కనోటా డ్యామ్‌లో ఐదుగురు యువకులు నీటిలో మునిగి చనిపోయారు.

By అంజి  Published on  12 Aug 2024 2:45 PM IST
Five friends drown, Jaipur, Kanota Dam,Rajasthan

విషాదం.. డ్యామ్‌లో మునిగిన ఐదుగురు స్నేహితులు.. నలుగురి డెడ్‌బాడీలు వెలికితీత

రాజస్థాన్‌లోని జైపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కనోటా డ్యామ్‌లో ఐదుగురు యువకులు నీటిలో మునిగి చనిపోయారు. ఆదివారం నాడు డ్యామ్‌ను చూడటానికి వచ్చిన ఆరుగురు యువకుల బృందంలో ఒక యువకుడు అదుపు తప్పి డ్యామ్‌లో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు ఐదుగురు స్నేహితులు డ్యామ్‌లో

ఒక యువకుడు తనకు తాను రక్షించుకున్నప్పటికీ, మిగతా యువకులు గల్లంతయ్యారు. దీంతో వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), సివిల్ డిఫెన్స్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అర్థరాత్రి నీటి నుండి నలుగురి మృతదేహాలను వెలికితీసింది. అయితే, ఒక మృతదేహం ఇంకా కనిపించలేదు. మరో వ్యక్తి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

"ఆరుగురు స్నేహితులు కనోట డ్యామ్‌ని సందర్శించడానికి వెళ్లారు. రాజ్ బ్రిజ్వాసి అనే యువకుడు జారిపడినప్పుడు, అతనిని రక్షించడానికి అతని ఐదుగురు స్నేహితులు దూకారు. రాజ్ తనను తాను రక్షించుకోగలిగినప్పటికీ, వినయ్, హర్ష్, వివేక్, అజయ్, హర్కేష్ మునిగిపోయారు" అని పోలీసులు పేర్కొన్నారు. బాధితులు జైపూర్‌లోని శాస్త్రి నగర్‌ వాసులు.

Next Story