నాకేం కాదని హామీ పత్రం ఇవ్వండి.. అప్పుడే వ్యాక్సిన్‌ వేయించుకుంటా.!

First got the guarantee of the family in writing from the district officer, then got the vaccine. దేశంలో ఇప్పటికే 122 కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ ప్రక్రియ జరిగింది. అయినా ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్‌ వేయించుకునే విషయంలో

By అంజి  Published on  30 Nov 2021 9:25 AM IST
నాకేం కాదని హామీ పత్రం ఇవ్వండి.. అప్పుడే వ్యాక్సిన్‌ వేయించుకుంటా.!

దేశంలో ఇప్పటికే 122 కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ ప్రక్రియ జరిగింది. అయినా ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్‌ వేయించుకునే విషయంలో భయపడుతున్నారు. తాజాగా జిల్లా అధికారి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఓ వ్యక్తి వ్యాక్సిన్‌ వేయించుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని హుబ్బలి-ధార్వాడ్‌ జిల్లాకు చెందిన ఆనంద్‌ అనే వ్యక్తి వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత తనకి ఏదైనా జరిగితే, తన కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారని, తనకు హామీ పత్రం ఇస్తేనే వ్యాక్సిన్‌ వేయించుకుంటానని మొండిపట్టుపట్టాడు. చివరికి జిల్లా అధికారి లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు. హుబ్బళ్లి-ధార్వాడ్ జిల్లా జిల్లా అధికారి.. ఆనంద్ అనే వ్యక్తికి లిఖితపూర్వకంగా హామీ ఇస్తూ, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే.. అతని మొత్తం కుటుంబం యొక్క బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుందని చెప్పాడు. వ్రాతపూర్వక హామీ పొందిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోవడానికి అంగీకరించాడు.

హుబ్బళ్లి-ధార్వాడ జిల్లాలో వ్యాక్సిన్‌ను వేగవంతం చేయడానికి స్థానిక జిల్లా యంత్రాంగం వివిధ సంఘాల పెద్దలు, మత సాధువుల సమావేశం ఏర్పాటు చేసింది. మెట్రోపాలిటన్ మున్సిపాలిటీలో ఈ సమావేశం జరుగుతుండగా ఆనంద్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. సమావేశంలో తాను తన కుటుంబానికి టీకాలు వేయించానని, అయితే తనకు ఏదైనా జరిగితే, కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారని తనకు టీకా వేయించుకోలేదని చెప్పాడు. ఆనంద్ జిల్లా యంత్రాంగం ముందు తన అభిప్రాయాన్ని చెప్పగా, మున్సిపాలిటీ అధికారులు మొదట అతనిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అతను అంగీకరించకపోవడంతో, జిల్లా అధికారి నితీష్ పాటిల్ ఆనంద్‌కు రాతపూర్వకంగా హామీ ఇస్తానని చెప్పారు. జిల్లా అధికారి నుండి హామీ పొందిన తరువాత, ఆనంద్ వ్యాక్సిన్‌కు అంగీకరించాడు. అక్కడ ఉన్న ఆరోగ్య శాఖ బృందం అతనికి కూడా టీకాలు వేసింది.

Next Story