షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్ర‌మాదం

Fire in Shalimar Express train near Maharashtra's Nasik.ముంబైకి వెలుతున్న షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్ర‌మాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2022 12:24 PM IST
షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్ర‌మాదం

ముంబైకి వెలుతున్న షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. మంట‌లు చెల‌రేగ‌డంతో ప్ర‌యాణీకులు ఆందోళ‌న చెందారు. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌యాణీకులు ఎవ్వ‌రికి ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ప‌శ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ ల మ‌ధ్య న‌డిచే షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఇంజిన్ ప‌క్క‌న ఉన్న పార్శిల్ కోచ్‌లో శనివారం ఉద‌యం 8.45గంట‌లకు ముందుగా మంట‌లు చెల‌రేగాయి.రైలు నాసిక్ రైల్వే స్టేష‌న్ చేరుకున్న త‌రువాత అక్క‌డికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను ఆర్పి వేశారు.

అధికారులు స‌కాలంలో స్పందించ‌డంతో మంట‌లు ఇత‌ర బోగీల‌కు వ్యాపించ‌లేదు. పార్శిల్ భోగీలో మంట‌లు చెల‌రేగ‌డంతో ప్ర‌యాణీకులు ఎవ్వ‌రికి ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. ఒక‌వేళ ప్యాసింజ‌ర్ భోగిలో మంట‌లు చెల‌రేగితే ప‌రిస్థితి తీవ్రంగా ఉండేది. ప్ర‌యాణీకులంతా సుర‌క్షితంగా ఉన్నార‌ని సెంట్ర‌ల్ రైల్వే చీఫ్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్ శివాజీ సుతార్ తెలిపారు. మంట‌లు అంటున్న పార్శిల్ కోచ్‌ను రైలు నుంచి విడ‌దీసిన‌ట్లు తెలిపారు. ఆ భోగి లేకుండానే రైలును పంపించారు.

Next Story