నడుస్తున్న రైలులో భారీగా చెలరేగిన మంటలు

బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలోని కియుల్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రైలులోని మూడు కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నాయి.

By అంజి  Published on  7 Jun 2024 6:24 AM IST
Fire, Patna Jharkhand Passenger Train, Bihar

నడుస్తున్న రైలులో భారీగా చెలరేగిన మంటలు 

బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలోని కియుల్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రైలులోని మూడు కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నాయని, అయితే ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పాట్నా-హౌరా మార్గంలో పాట్నా నుండి జసిదిహ్ వెళ్తుండగా.. కొద్ది దూరం రైలు కియుల్ స్టేషన్‌కు చేరుకోబోతుండగా సాయంత్రం 5.24 గంటలకు మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు అలారం చైన్‌ని లాగారు. రైలు కియుల్ స్టేషన్‌లోకి ప్రవేశించినప్పుడు, మంటలు మూడు కోచ్‌లను చుట్టుముట్టినప్పటికీ వారు బయటకు పరుగెత్తారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

స్థానికులు, రైల్వే సిబ్బంది సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, సరన్సవతి చంద్ర మాట్లాడుతూ.. రైలులో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులను తరువాత ప్రభావితం కాని కోచ్‌లకు తరలించి, జసిదిహ్‌కు పంపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రఈ ఘటనతో ఆ మార్గంలో ఆరు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇదిలా ఉంటే.. ఇటీవల పంజాబ్‌ గూడ్స్‌ రైలు ప్రమాదానికి లోకో పైలట్లే కారణమని అధికారులు వెల్లడించారు. లోకోపైలట్‌తో సహా అసిస్టెంట్‌ కూడా నిద్రపోవడంతో రెడ్‌ సిగ్నల్‌ పడినా బ్రేకులు వేయలేదని నిర్ధారించారు. ఇదే విషయాన్ని వారు అంగీకరించినట్టు పేర్కొన్నారు.

Next Story