బ్రహ్మశక్తి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. రోగి మృతి

Fire breaks out at ICU ward of Delhi hospital Patient dead.దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. రోహిణి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2022 11:52 AM IST
బ్రహ్మశక్తి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. రోగి మృతి

దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. రోహిణి ప్రాంతంలోని పూత్ ఖుర్ద్‌ లో ఉన్న బ్ర‌హ్మ‌శ‌క్తి ఆస్ప‌త్రిలో శ‌నివారం ఉద‌యం మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన రోగులు, సిబ్బంది బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఈ ఘ‌ట‌న‌లో ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) వార్డులోని ఓ రోగి మృతి చెందాడు. ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది 9 ఫైరింజ‌న్ల‌తో అక్క‌డ‌కు చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు

వెంటిలేటర్‌పై ఉన్న ఒకరిని మినహాయించి భవనం లోపల ఉన్న రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ఒక్క‌రు మాత్ర‌మే మ‌ర‌ణించిన‌ట్లు తెలిపారు. కాగా.. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

Next Story