మద్యం తాగి పాఠాలను చెబుతోంది.. ఈ టీచరమ్మ రూటే వేరు
Female Teacher Suspended over Drinking Alcohol in school.విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు దారి తప్పింది.
By తోట వంశీ కుమార్ Published on 9 Sept 2022 8:52 AM ISTవిద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు దారి తప్పింది. ఏకంగా పాఠశాలనే బార్‌గా మార్చేసింది. మద్యం తాగి విద్యార్థులకు పాఠశాలను బోధిస్తోంది. మత్తులో కారణం లేకుండానే విద్యార్థులను తిట్టడం, కొట్టడం వంటివి చేస్తూ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని తమకూరులో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గంగలక్ష్మమ్మ అనే ఉపాధ్యాయురాలు 25 సంవత్సరాలుగా చిక్కసారంగిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తోంది. గత ఐదేళ్లుగా ఆమె మద్యానికి బానిసగా మారింది. మద్యం తాగి పాఠశాలకు వస్తోందని, మత్తులో కారణంగా లేకుండా విద్యార్థులను తిట్టడం, కొట్టడం, తోటి ఉపాధ్యాయులతో గొడవలు పడడం వంటివి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. పలుమార్లు స్థానికులు అంతా కలిసి ప్రవర్తన మార్చుకోవాలని ఉపాధ్యాయురాలిని కోరినప్పటికి ఫలితం లేకుండా పోయింది.
దీంతో వారంతా బీఈఓకు ఫిర్యాదు చేశారు. గురువాం బీఈవో హనుమానాయక్ పాఠశాలకు వచ్చి విచారించారు. ఉపాధ్యాయురాలి టేబుల్‌లో మద్యం సీసాలు ఉన్నాయని విద్యార్థులు చెప్పగా.. తీయాలని బీఈఓ ఆదేశించారు. అయితే.. సదరు ఉపాధ్యాయురాలు టేబుల్ డ్రాయర్‌కు తాళం వేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు టేబుల్‌ను పగలకొట్టి చూడగా.. ఓ మద్యం సీసా, మరో రెండు ఖాళీ సీసాలు గుర్తించారు.
దీంతో గంగలక్ష్మమ్మ గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానంటూ హంగామా చేసింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని మద్యం సీసాలను సీజ్ చేశారు. బీఈఓ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.