జార్ఖండ్‌లోని గొడ్డ సదర్ ఆస్పత్రిలో వింత కేసు వెలుగు చూసింది. 22 ఏళ్ల యువకుడి శరీరంలో ఆడ పునరుత్పత్తి అవయవాలు కనిపించాయి. దీంతో ప్రజలు ఆ యువకుడిని అర్ధనారీశ్వరుడిగా అభివర్ణిస్తున్నారు. యువకుడు హెర్నియా ఆపరేషన్ కోసం గొడ్డ సదర్ ఆస్పత్రికి వచ్చాడు. యువకుడిని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లగా.. అతనిలో ఆడ, మగ రెండు జననంగాలు రెండూ అభివృద్ధి చెందడంతో వైద్యులు అతని జననంగాలను చూసి ఆశ్చర్యపోయారు.
యువకుడికి గత కొన్ని రోజులుగా కడుపునొప్పి ఉందని అసిస్టెంట్ డాక్టర్ తెలిపారు. వైద్యులను సంప్రదించగా అతనికి చిన్నప్పటి నుంచి కుడివైపు హెర్నియా ఉందని తేలింది. అల్ట్రాసౌండ్ అనేక సార్లు జరిగింది. అనంతరం యువకుడికి ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స సమయంలో.. అతడి శరీరంలో అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్‌లతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందాయని డాక్టర్ కనుగొన్నారు.
వైద్యుడు తారా శంకర్ ఝా మాట్లాడుతూ.. ఇలాంటి కేసు లక్షల్లో ఒకరికి వస్తుందని చెప్పారు. దీనిని నిజమైన హెర్మాఫ్రొడైట్ అంటారు. జీవశాస్త్రపరంగా దీనిని పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ (PMDS) అంటారు. అతడి శరీరం నుండి స్త్రీ పునరుత్పత్తి అవయవాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. యువకుడి వివరాలను గోప్యంగా ఉంచామని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.