కొడుకు ఐఏఎస్ అవాలనుకున్నాడు.. ఢిల్లీ పేలుడుతో లింక్ ఉంద‌ని తెలియ‌డంతో ఆ తండ్రి..

జాసిర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడిని త‌న తండ్రి ఐఏఎస్ చేయాలనుకున్నాడు, కానీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడులో అతని పేరు వచ్చింది.

By -  Medi Samrat
Published on : 17 Nov 2025 9:46 PM IST

కొడుకు ఐఏఎస్ అవాలనుకున్నాడు.. ఢిల్లీ పేలుడుతో లింక్ ఉంద‌ని తెలియ‌డంతో ఆ తండ్రి..

జాసిర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడిని త‌న తండ్రి ఐఏఎస్ చేయాలనుకున్నాడు, కానీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడులో అతని పేరు వచ్చింది. పోలీసులు అతనిని, అతని తండ్రిని, నా భర్తను అరెస్టు చేశారు. దీంతో జాసిర్ తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చాలా అవమానంగా భావించి నిప్పంటించుకుని ఈరోజు తెల్లవారుజామున ఆస్పత్రిలో చనిపోయాడని జాసిర్ అత్త నసీమా అక్తర్ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతూ మొత్తం విష‌యాన్ని వివ‌రించింది.

ఈరోజు మా ఇల్లు శోకసంద్రం ఉందని, జాసిర్ చేసిన ఒక్క తప్పిదం వల్ల కుటుంబం సర్వ నాశనం అయిందని పేర్కొంది. జాసిర్ తండ్రి బిలాల్ అహ్మద్ వానీ ఆదివారం ఉదయం తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో కుల్గాం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన చికిత్స కోసం శ్రీనగర్‌కు తీసుకొచ్చారు.

ఎర్రకోట వెలుపల ఆత్మాహుతి దాడి, జైష్ మరియు అన్సార్ ఘజ్వతుల్ హింద్ యొక్క వైట్ కాలర్ మాడ్యూల్‌తో అతనికి సంబంధం ఉంద‌ని ప‌క్కా సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న వ్య‌క్తే జసీర్ వానీ అలియాస్ డానిష్.

NIA ఈరోజు అతన్ని అరెస్టు చేసింది. కారు బాంబు దాడికి ముందు.. జసీర్ డ్రోన్లు, రాకెట్లతో దాడికి ప్లాన్ చేశాడని పేర్కొంది. ఉగ్రవాద వైద్యుడు ఉమర్ నబీ, అతని సహచరుడు అమీర్ మరియు ఇతర ఉగ్రవాదుల కోసం డ్రోన్లు, రాకెట్లను తయారు చేసేందుకు జాసిర్ ప్రయత్నించాడు.

జాసిర్ తండ్రి బిలాల్ అహ్మద్ వనీ డ్రై ఫ్రూట్స్ అమ్మేవాడు. ఆయ‌న‌ డాక్టర్ అదీల్, డాక్టర్ ముజఫర్‌ల పొరుగున కుటుంబంతో నివ‌సించేవాడు. డాక్టర్ అదీల్ ప్రస్తుతం అరెస్టయ్యాడు, అతని సోదరుడు డాక్టర్ ముజఫర్ పరారీలో ఉన్నాడు. ఈత‌డు ఆఫ్ఘనిస్తాన్‌లో తలదాచుకునే అవకాశం ఉంది.

మీరట్‌లోని సహరాన్‌పూర్‌లో డాక్టర్ అదీల్‌ని పట్టుకున్నారు. అతని సమాచారం మేరకు అనంత్‌నాగ్‌లోని GMC హాస్పిటల్‌లోని అతని లాకర్ నుండి రైఫిల్, ఇతర అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

దక్షిణ కాశ్మీర్‌లోని వాన్‌పోరా కుల్గామ్‌లో బిలాల్ అహ్మద్ వనీ, డాక్టర్ అదీల్‌ల ఇళ్లు చాలా తక్కువ దూరంలో ఉంటాయి. మూడు రోజుల క్రితం బిలాల్ అహ్మద్ వానీ, అతని సోదరుడు నవీల్ వానీ, అతని కుమారుడు జాసిర్ బిలాల్ వానీ అలియాస్ డానిష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం బిలాల్‌ను విడుదల చేశారు.

తన భర్త కూడా ఫిజిక్స్ లెక్చరర్ అని, జాసిర్ తండ్రి బిలాల్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నాడని నసీమా అక్తర్ తెలిపారు. మా కుటుంబం మొత్తం డ్రై ఫ్రూట్స్ వ్యాపారంలో పాల్గొంటుంది. బిలాల్ సాహెబ్.. జాసిర్ ఐఏఎస్ చేయాల‌నుకున్నాడు. జాసిర్‌ని కలిసి.. ఎందుకు ఇలా చేశావ‌ని అడగాలనుకున్నాడు? మా కుటుంబాన్ని మొత్తం ఈ ఏరియాలో ఎంతో గౌరవంగా చూస్తారు. రాజకీయాలతో లేదా ఉగ్రవాదంతో మాకు ఎలాంటి సంబంధం లేదు.

అదీల్ మా పొరుగువాడు, కానీ అతను ఏమి చేస్తాడో, డాక్టర్ ముసుగులో ఏమి చేస్తున్నాడో మాకు తెలియదు. జాసిర్ కూడా చదువుతున్నాడు. అతడు వారితో ఎలా చేరాడో అర్ధం కాలేదు. ఈ ఉదంతంతో బిలాల్ సాహిబ్ చాలా నిరుత్సాహానికి గురయ్యాడు.. ఎందుకు ఇలా చేశాడో కనీసం ఒక్కసారైనా నేను జాసిర్‌తో మాట్లాడాలి అని అన్నారు. కానీ ఆయ‌న‌ కలవలేకపోయాడు. నిన్న ఉదయం ఇంటికి చేరుకోగానే చాలా నిరుత్సాహంగా మౌనంగా కనిపించాడు. ఆయ‌న‌ ఇలాంటి పని చేస్తాడని మేము అనుకోలేదు. కారులోంచి పెట్రోల్ తీసి తనపై చల్లుకున్నాడు. మేము, మా పొరుగువారు మంటలను ఆర్పే సమయానికి ఆయ‌న‌ తీవ్రంగా కాలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా ఈరోజు తెల్లవారుజామున మృతి చెందాడని పేర్కొంది.

బిలాల్ అహ్మద్ పొరుగు వ్య‌క్తి. ఏమి జరుగుతుందో ఇక్కడ ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇక్కడ అందరూ ఒకరినొకరు అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. బిలాల్ అంత్యక్రియలకు ఇక్కడికి వచ్చిన వారంతా ఇదే మాట చెబుతున్నారని స్థానికులు అన్నారు. కొడుకు చేసిన ప‌ని తండ్రిని ఎక్కడికి తీసుకెళ్లాయి? బిలాల్ చాలా ఎమోషనల్ మనిషి.. ఈ ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story