కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి 20 మందికిపైగా సజీవ దహనమయ్యారు. ఈ బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.
చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ తాలూకాలోని గొర్లతు క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మరణించారు. ఒక ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సులోని 20త మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మిగిలిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చేరారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పుడు చెబుతున్నారు.
జాతీయ రహదారి 48 పై ఒక వైపు నుండి వస్తున్న లారీ డివైడర్‌ను దాటి, మరొక వైపు నుండి వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఢీకొన్న కారణంగా స్లీపర్ కోచ్ బస్సు రోడ్డు మధ్యలో మంటల్లో చిక్కుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. లారీ హిరియూర్ నుండి బెంగళూరుకు వెళుతోందని చెబుతున్నారు. బస్సు బెంగళూరు నుండి శివమొగ్గకు వెళుతోంది. ఎస్పీ రంజిత్ ప్రస్తుతం సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి హిరియూర్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.