KYC పూర్తీ చేయని ఫాస్ట్‌ట్యాగ్‌లు ఏమైపోతాయంటే?
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మొత్తం టోల్ వసూలు ప్రక్రియను సులభతరం చేయడానికి
By Medi Samrat Published on 16 Jan 2024 7:45 PM ISTనేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మొత్తం టోల్ వసూలు ప్రక్రియను సులభతరం చేయడానికి, మరింత సమర్థవంతంగా చేయడానికి ఒక వాహనం, ఒక ఫాస్ట్‌ట్యాగ్ చొరవను ప్రారంభించింది. NHAI నుండి వచ్చిన చొరవ ప్రకారం వేర్వేరు వాహనాలకు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించకుండా లేదా ఒకే వాహనం కోసం బహుళ ఫాస్ట్‌ట్యాగ్‌లను ఉపయోగించకుండా నిరోధించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. KYC పూర్తీ చేయని ఫాస్ట్‌ట్యాగ్‌లు జనవరి 31 తర్వాత బ్లాక్ అవుతాయని NHAI ప్రకటించింది.
ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు 'నో యువర్ కస్టమర్' (KYC)ని పూర్తి చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. జనవరి 31 లోపు కేవైసీ పూర్తి చేయకపోతే ఆ తర్వాత వారి కార్డులు డీయాక్టివేట్ అవుతాయని తెలిపారు. అంతేకాదు తగినంత బ్యాలెన్స్ ఉన్నా కానీ KYC లింక్ సరిగా లేకుంటే వాటిని బ్లాక్‌లిస్ట్ చేయనున్నారు. మీ ఫాస్ట్‌ట్యాగ్ KYC అయిందో లేదో మీకు ఖచ్చితంగా తెలియకపోతే.. బ్లాక్‌లిస్ట్ చేయడానికి ముందు మీరు దాన్ని తనిఖీ చేయాలి. అంతేకాకుండా, ఒకే వాహనం కోసం ఒకే వ్యక్తికి లింక్ చేయబడిన పాత ఫాస్ట్‌ట్యాగ్‌లు నిషేధించనున్నారు. మీ పేరు, చిరునామా లేదా ఏదైనా ఇతర సమాచారం మారితే, వాటిని త్వరగా అప్‌డేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు సమీపంలోని టోల్ ప్లాజాకు లేదా వారి సంబంధిత జారీ చేసే బ్యాంకుల టోల్ ఫ్రీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయాలి.