నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి వ్యక్తిగత వాహనాల ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంచనుంది. ప్రస్తుతం రూ.3 వేలుగా ఉన్న వార్షిక పాస్ ధర 2.5 శాతం పెరిగి రూ.3,075 కు చేరుకోనుంది. ఈ పాస్ ద్వారా దేశంలో ఉన్న 200 టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా ప్రయాణించవచ్చు. అయితే ఈ నెలాఖరు లోపు రీఛార్జ్ చేసుకునే వారు పాత ధర రూ.3 వేలకే వార్షిక పాస్‌ను పొందే అవకాశం కల్పించారు. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వార్షిక పాస్ విధానానికి వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పటి వరకు సుమారు 52 లక్షల మందికి పైగా వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.