అయోధ్యలో ఫాస్ట్ ట్రాక్ లైన్.. ఎందుకోసమంటే?
అయోధ్య రామాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగిపోయింది.
By Medi Samrat Published on 31 Jan 2024 2:30 PM GMTఅయోధ్య రామాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగిపోయింది. భక్తులకు ప్రవేశం కోసం, పొడవైన క్యూలను తగ్గించడానికి.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫాస్ట్ ట్రాక్ లైన్‌ను ఏర్పాటు చేసింది. ఎటువంటి వస్తువులు లేకుండా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ లైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ ఏడాది జనవరి 22న రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తర్వాత, రామ్‌లల్లా దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు భారీగా అయోధ్యను సందర్శిస్తున్నారు.
ఊహించని రద్దీ రామమందిర ట్రస్టుకు పెద్ద సవాలుగా మారింది. అయోధ్య ఐజీ జోన్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. భక్తులు ఎలాంటి వస్తువులు లేకుండా వస్తే ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ లైన్ ఉంటుంది. మిగిలిన వాళ్లు పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో, భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ముందు వారి వస్తువులను డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయడానికి ముందు అన్ని వస్తువులను స్కాన్ చేస్తున్నారు. ఆలయం ప్రారంభించిన తర్వాత 6 రోజుల్లోనే దాదాపు 19 లక్షలమంది భక్తుల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రద్దీ రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అంచనా వేస్తోంది. వీకెండ్‌లో ఈ రద్దీ ఎక్కువగా ఉంటోంది.