నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా.. బీజేపీని మహమ్మద్ అలీ జిన్నాతో పోల్చారు. జిన్నా తన జేబులో కాశ్మీర్ ఉందని నమ్మినట్లే.. బీజేపీ కూడా ఈ ప్రాంతంలోని మెజారిటీ నియోజకవర్గాలను గెలుచుకున్న తరువాత జమ్మూపై అదే నమ్మకాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ ఎన్నికలు చాలా క్లిష్టమైనవని. అన్ని శక్తులు నేషనల్ కాన్ఫరెన్స్ కు వ్యతిరేకంగా ఉన్నాయని.. భారీ బాధ్యతల దృష్ట్యా కొత్త ముఖ్యమంత్రి ముళ్ల కిరీటం ధరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బిజెపి జేబులో ఉండాలా లేదా గౌరవం కోసం పోరాటంలో చేరాలా అనేది ఇప్పుడు జమ్మూ ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ప్రజలు ఎన్సీని విస్మరించి ఉండవచ్చు, కానీ మేము వారిని ఎప్పుడూ విస్మరించలేదన్నారు. ఎన్ సికి మెజారిటీ ఇచ్చిన ఎన్నికల గురించి ఆయన మాట్లాడుతూ..ప్రజలు అన్ని అడ్డంకులను ఎదుర్కొని కుట్రలను ఓడించారని అన్నారు. ఇప్పుడు తిరిగి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.