గనిలో రైతు చేతికి చిక్కిన రూ. 60 లక్షల విలువైన డైమండ్.. మరో ఆరుగురికి చిన్న చిన్న డైమండ్లు

farmer finds 13 carat diamond worth rs 60 lakh in excavation in panna district. గనిలో రైతు చేతికి చిక్కిన రూ. 60 లక్షల విలువైన డైమండ్.. మరో ఆరుగురికి చిన్న చిన్న డైమండ్లు

By అంజి  Published on  8 Dec 2021 4:28 AM GMT
గనిలో రైతు చేతికి చిక్కిన రూ. 60 లక్షల విలువైన డైమండ్.. మరో ఆరుగురికి చిన్న చిన్న డైమండ్లు

మధ్యప్రదేశ్‌లోని పన్నాకు చెందిన ఓ పేద కార్మికుడు ఇప్పుడు లక్షాధికారి అయిపోయాడు. సోమవారం కృష్ణ కళ్యాణ్‌పూర్‌లోని వజ్రాల గనిలో తవ్వకాలు జరుపుతుండగా 13 క్యారెట్ల నాణ్యమైన వజ్రం ఆ పేద కార్మికుడికి దొరికింది. ఈ వజ్రం ధర దాదాపు రూ.60 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ వజ్రంతో పాటే తనతో తవ్వకాలు జరుపుతున్న సహా కార్మికులకు మరో ఆరు చిన్న వజ్రాలు దొరికాయి. ఒకే రోజున 7 వజ్రాలు దొరకడంతో ఆ కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సోమవారం గిరిజన రైతు ములాయం సింగ్‌కు 13 క్యారెట్ల వజ్రం దొరికింది. ఇప్పుడు ఈ వజ్రాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో పిల్లలకు చదువు చెప్పిస్తానని ములాయం సింగ్ అన్నారు.

తదుపరి వేలంలో వజ్రాన్ని ఉంచనున్నారు. దొరికిన వజ్రాల విలువ లక్షలాది రూపాయలని తెలిపారు. ఈ వజ్రాలు 13.54 క్యారెట్లు, 6 క్యారెట్లు, 4 క్యారెట్లు, (43 సెంట్లు, 37 సెంట్లు, 74 సెంట్లు). వీటి ధర కోటి రూపాయల వరకు ఉంటుంది. వేలం సమయంలోనే ఈ వజ్రాల అసలు ధర తెలుస్తుందని అనుపమ్ సింగ్ తెలిపారు. కానీ వజ్రాలు దొరికిన తీరుతో పేద ప్రజలు సంతోషిస్తున్నారు. ఎందుకంటే అది వారి భవిష్యత్తును మార్చేసింది. 13 క్యారెట్ల వజ్రం కోసం వెతుకుతున్న కార్మికుడు ములాయం సింగ్‌కు ఎంత డబ్బు వస్తుందని అడిగినప్పుడు, వజ్రాల వేలం జరిగినప్పుడు, వచ్చిన మొత్తంలో 12 శాతం తగ్గించి, మొత్తం డబ్బు ములాయంకు ఇస్తామని డైమండ్ కార్యాలయం తెలిపింది. వజ్రాన్ని రూ.60 లక్షలకు వేలం వేస్తే.. ములాయం రూ.52.80 లక్షలు దక్కించుకున్నారు.

Next Story