దొంగ నోట్లు బాగా పెరిగిపోయాయి.. మీ చేతిలో ఉన్నది ఏదో చూసుకోండి కాస్త.!

2,000 రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించిన ఒక సంవత్సరం తర్వాత, 2024–25లో నకిలీ రూ. 500 నోట్లు బాగా పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ డేటా తెలిపింది.

By -  Medi Samrat
Published on : 29 Oct 2025 8:50 PM IST

దొంగ నోట్లు బాగా పెరిగిపోయాయి.. మీ చేతిలో ఉన్నది ఏదో చూసుకోండి కాస్త.!

2,000 రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించిన ఒక సంవత్సరం తర్వాత, 2024–25లో నకిలీ రూ. 500 నోట్లు బాగా పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ డేటా తెలిపింది. కొత్త మహాత్మా గాంధీ సిరీస్‌లోని నకిలీ రూ. 500 నోట్ల గుర్తింపు 2024–25లో 1,17,722 ఉండగా, 2023–24లో 85,711 నోట్లు, 2022–23లో 91,110 నోట్లు ఉన్నాయి.

రూ.2,000 నోట్ల ఉపసంహరణ తర్వాత 500 రూపాయల దొంగ నోట్ల చలామణీలో పెరుగుదల కనిపించింది. నకిలీ రూ.2,000 నోట్లు 2022–23లో 9,806 నుండి 2023–24లో 26,035కి పెరిగాయి, ఆ తర్వాత 2024–25లో 3,508కి తగ్గాయి. రూ.2,000 నోట్ల విస్తృతంగా ఉపయోగించకపోవడంతో రూ.500 నోటు వైపు కేటుగాళ్లుదృష్టి మళ్లించారని తెలుస్తోంది.

అన్ని డినామినేషన్లలో నకిలీ కరెన్సీని గుర్తించడం 2021–22లో 2,30,971 ఉండగా.. 2024–25లో 2,17,396కి స్వల్పంగా తగ్గింది. అయితే, కొత్త-సిరీస్ రూ. 500 నోటు ఇప్పుడు నకిలీ నోట్లలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆర్‌బిఐ చట్టం, 1934లోని సెక్షన్ 25 ప్రకారం బ్యాంక్ నోట్ భద్రతా లక్షణాలను క్రమం తప్పకుండా సమీక్షిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Next Story