రష్యా నుంచి తక్కువ ధరకే భారత్ ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. తాజాగా ఈ ఒప్పందంపై చాలా దేశాలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే.. భారత్ మరోసారి సమర్థించుకుంది. బ్యాంకాక్‌లో జరిగిన 9వ భారత్ - థాయిలాండ్ సంయుక్త కమిషన్ మీటింగ్‌లో పాల్గొన్న విదేశాంగమంత్రి జైశంకర్.. రష్యాతో ఇంధనాన్ని కొనుగోలు చేయడాన్ని సమర్థించుకుంది. భారత్‌లో ఇంధనం, గ్యాస్ ధరలు ఆకాశనంటుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా నుంచి తక్కువ ధరకు ఇంధనాన్ని కొనుగోలు చేయడం తప్పుకాదని స్పష్టం చేశారు.
దేశ ప్రజల సంక్షేమం కోసమే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జైశంకర్ తెలిపారు. దేశంలో తలసరి ఆదాయం రెండు వేల డాలర్లు ఉందని, భారత ప్రజలు ఇంధనం కోసం అధిక ధరలు వెచ్చించలేరని ఆయన తెలిపారు. ఆసియా దేశాలకు ఇంధనాన్ని సరఫరా చేసే సాంప్రదాయ ఇప్పుడు యూరప్‌కు తరలిస్తున్నాయని చెప్పారు. యూరప్ దేశాలు రష్యా నుంచి గ్యాస్ దిగుమతులు తగ్గించుకొని.. భారత్‌కు ఇంధనం సరఫరా చేసే పశ్చిమాసియా దేశాల నుంచి అధికంగా కొనుగోలు చేస్తున్నాయన్నారు.
ప్రతి దేశం అధిక ఇంధన ధరలను తగ్గించడానికి సాధ్యమైనంత మేరకు బెస్ట్ పాలసీల వైపు మొగ్గు చూపుతాయని, తాము కూడా అదే చేస్తున్నామని మంత్రి జైశంకర్ చెప్పారు. ఈ విషయంలో తాము చాలా ఓపెన్‌గా.. నిజాయతీగా ఉన్నామన్నారు. తమది 2 వేల డాలర్ల తలసరి ఆదాయం ఉన్న దేశమని, ఇక్కడి ప్రజలు అధిక ఇంధన ధరలను భరించలేరని, చమురు కొనుగోలు విషయంలో మెరుగైన ఒప్పందాలను అన్వేషించడం తమ నైతిక బాధ్యత అని జైశంకర్ అన్నారు.