సన్నీ లియోన్ హాజరయ్యే ఫ్యాషన్ షో.. కొన్ని మీటర్ల దూరంలో భారీ పేలుడు

Explosion at Sunny Leone’s fashion show venue in Imphal. నటి సన్నీ లియోన్ ఆదివారం హాజరు కావాల్సిన ఇంఫాల్‌లోని ఫ్యాషన్ షో వేదిక సమీపం

By Medi Samrat  Published on  4 Feb 2023 9:55 AM GMT
సన్నీ లియోన్ హాజరయ్యే ఫ్యాషన్ షో.. కొన్ని మీటర్ల దూరంలో భారీ పేలుడు

నటి సన్నీ లియోన్ ఆదివారం హాజరు కావాల్సిన ఇంఫాల్‌లోని ఫ్యాషన్ షో వేదిక సమీపంలో శనివారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. మణిపూర్ రాజధాని హట్టా కాంగ్‌జేబుంగ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో వేదికకు 100 మీటర్ల దూరంలో మాత్రమే పేలుడు సంభవించింది. పేలుడు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ లేదా గ్రెనేడ్ వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. పేలుడుకు బాధ్య‌త వ‌హిస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు మిలిటెంట్ సంస్థ‌లు ప్ర‌క‌టించ‌లేదు.


Next Story