రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు..!
Explosion at Raipur railway station. ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో పేలుడు సంభవించిన ఘటనలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు
By అంజి Published on
16 Oct 2021 6:16 AM GMT

ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో పేలుడు సంభవించిన ఘటనలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాయ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్ ఫామ్ నెంబర్ 2లో చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం 6.30 గంటల సమయంలో స్టేషన్‌లో ఆగిన సీఆర్పీఎఫ్ ప్రత్యేక రైలులో ఇగ్నైటర్ బాక్స్ కిందపడి పేలుడు జరిగింది. 122వ సీఆర్పీఎఫ్ సిబ్బంది జమ్ముకు వెళ్లేందుకు రైలు ఎక్కుతుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకొందరికి స్వల్పగాయాలయ్యాయని రాయపూర్ పోలీసులు తెలిపారు.
Next Story