ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసు.. కేజ్రీవాల్‌కు డబుల్ షాక్‌..

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు పొడిగించింది

By Medi Samrat  Published on  5 Jun 2024 4:48 PM IST
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసు.. కేజ్రీవాల్‌కు డబుల్ షాక్‌..

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. అలాగే కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూనే.. ఆయ‌న‌ ఆరోగ్యంపై సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా.. ఆయ‌న జ్యుడీషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. దీంతో కేజ్రీవాల్‌ జూన్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండాల్సి ఉంటుంది.

మరోవైపు.. సీఎం కేజ్రీవాల్ ఏడు రోజుల మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను రోస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ వైద్యపరమైన కారణాలను చూపుతూ 7 రోజులపాటు బెయిల్‌ను కోరారు. పిటిషన్‌ను తిర‌స్క‌రించ‌డంతో పాటు.. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది.

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై దాఖలైన అనుబంధ చార్జిషీట్‌పై విచారణ చేపట్టే అంశంపై కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ అంశంపై జూలై 9న నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశంపై అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మే 28న నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు.

Next Story