మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ సోమవారం ఎయిమ్స్ కార్డియాలజీ విభాగంలో చేరారు. ఉదయం వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నారు. దీంతో ఆయనను మొదట గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎయిమ్స్‌కు తరలించారు. ఆయన అక్కడ కార్డియాలజీ విభాగంలో చేరారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు.
ఆయనకు ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. రాన్ ఆఫ్ కచ్, ఉత్తరాఖండ్, కేరళ, ఢిల్లీలో జరిగిన సంఘటనలతో సహా అనేక బహిరంగ కార్యక్రమాలలో స్పృహ తప్పి పడిపోయారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో కూడా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ సమయంలోనే యాంజియోప్లాస్టీ కూడా చేశారు. ఆ తరువాత కూడా ఆయన ఒకటి, రెండుసార్లు ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందారు. ఈసారి కూడా మళ్లీ అపస్మారక స్థితికి రావడంతో మొదట సమీపంలోని ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందించారు. అనంతరం మధ్యాహ్నం ఎయిమ్స్‌కు తరలించారు.